Supreme Court : ముస్లిం మహిళలకూ భరణం.. మ‌త‌బేదం లేకుండా!

ముస్లిం మహిళలకు భరణం విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 కింద తమ భర్త నుంచి భరణం కోరొచ్చని తెలిపింది. మతంతో సంబంధం లేకుండా.. వివాహితులందరికీ ఈ సెక్షన్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది.

Arms Production : రికార్డు స్థాయిలో దేశీయ ఆయుధాల ఉత్పత్తి!

విడాకులు ఇచ్చిన భార్యకు భరణం చెల్లించే కేసులు కొత్తవేం కాదు. 1985లో షా బానో కేసు ఇందులో ప్రధానమైంది. మతంతో సంబంధం లేకుండా.. విడాకులు ఇచ్చిన మహిళలందరికీ భరణం చెల్లించాల్సిందేనని సీఆర్‌పీసీ సెక్షన్‌ 125ను ఉటంకిస్తూ.. ఆ సమయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే మరుసటి ఏడాది తీసుకొచ్చిన ముస్లిం విమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ డైవర్స్‌) చట్టం, 1986.. ఈ తీర్పును నీరుగార్చింది. 

#Tags