Abdul Rahim Rather: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు న‌వంబ‌ర్ 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.

సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత, చరార్-ఎ-షరీఫ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ రహీమ్ రాథర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
 
ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ కొత్త అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్‌కు నూతన బాధ్యతలను  అప్పగిస్తూ, అభినందనలు తెలియజేశారు. 80 ఏళ్ల అబ్దుల్ రహీమ్ రాథర్ గతంలో కూడా జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో స్పీకర్ పదవిని నిర్వహించారు. 2002 నుంచి 2008 వరకు పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ రైనాను బీజేపీ ఎన్నుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేత బాధ్యతలను సునీల్ శర్మకు అప్పగించారు. అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Assembly Elections: జార్ఖండ్ ఎన్నికలు.. జేఎంఎం అభ్యర్థుల జాబితాలు విడుదల

#Tags