Allotment for Railways : భార‌తీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయింపు..

కొత్త బడ్జెట్‌లో కేంద్రం భారతీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించింది.

కొత్త బడ్జెట్‌లో కేంద్రం భారతీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం కేటాయింపుల్లో రూ.1.08 లక్షల కోట్ల నిధులను రైల్వే భద్రత వ్యవస్థల మెరుగు, రైల్వే మార్గాల్లో కవచ్‌ వ్యవస్థ ఇన్‌స్టాలేషన్‌కు వినియోగించనున్నట్టు తెలిపారు. ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ వ్యవస్థ ‘కవచ్‌’ ఇన్‌స్టాలేషనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు.

New Names : రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో మారిన రెండు భ‌వ‌న్ల పేర్లు..!

రైల్వే భద్రతా చర్యల్లో భాగంగా పాత ట్రాకుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని.. అదేవిధంగా సిగ్నలింగ్‌ వ్యవస్థ మెరుగుపరుస్తామని.. రైల్వే ఓవర్, అండర్‌పాస్‌ బ్రిడ్జ్‌లను నిర్మిస్తామని.. కవచ్‌ వ్యవస్థను ఇన్‌స్టాల్‌ చేస్తామని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. కవచ్‌4.0 ఇటీవల ఆమోదం పొందిందని, ఇన్‌స్టాలేషన్‌ను త్వరితగతిన చేపడతామని పేర్కొన్నారు. 

#Tags