Female Apprenticeship Enrolment Soars: మహిళా అప్రెంటిస్‌లకు పెరుగుతున్న డిమాండ్..

సమ్మిళిత పని వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్యాక్టరీలు సంప్రదాయ హైరింగ్‌ విధానాలకు భిన్నంగా నియామకాలు చేపడుతుండటంతో మహిళా అప్రెంటిస్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఈ ఏడాది ఆఖరు నాటికి తయారీ రంగంలో వారి వాటా 40 శాతానికి చేరనుంది. స్టాఫింగ్‌ కంపెనీ టీమ్‌లీజ్‌ ఈ మేరకు అంచనాలతో నివేదిక రూపొందించింది. గడిచిన 8–10 నెలల్లో 10/12 తరగతులు పూర్తి చేసిన యువతులను అప్రెంటిస్‌లుగా నియమించుకునేందుకు డిమాండ్‌ అయిదు రెట్లు పెరిగిందని నివేదిక వివరించింది.

ఆటో, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎల్రక్టానిక్స్, ఫోన్ల తయారీ తదితర రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందని పేర్కొంది.  'గతంలో మహిళా అప్రెంటిస్‌ల అవసరం నెలకు 1,000–2,000 మంది స్థాయిలో ఉండేది కానీ ఇప్పుడది ఏకంగా 10,000–12,000 స్థాయికి పెరిగింది. దానికి అనుగుణంగా మహిళా అప్రెంటిస్‌ల రిక్రూట్‌మెంట్‌ కూడా 10–15 శాతం నుంచి 45–50 శాతానికి పెరిగింది' అని టీమ్‌లీజ్‌ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ విభాగం చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌ సుమీత్‌ కుమార్‌ తెలిపారు.

 

UPSC CAPF Notification 2024: డిగ్రీ అర్హతతో అసిస్టెంట్‌ కమాండెంట్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

వివిధ స్కీముల్లో ప్రత్యేకంగా స్త్రీ, పురుషులకంటూ వేర్వేరుగా బడ్జెట్‌లు కేటాయించకపోయినా, శిక్షణా కార్యక్రమాలు ఎక్కువగా మహిళలను ప్రోత్సహించే విధంగా, వారికి అనువైన విధంగా ఉంటున్నాయని నివేదిక వివరించింది. తయారీ రంగంలో అప్రెంటిస్‌షిప్‌ చేస్తున్న మహిళల్లో 70 శాతం మంది గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాలకు చెందిన వారు ఉంటున్నారు.

ఆయా ప్రాంతాల్లో నైపుణ్యాల అభివృద్ధి, వొకేషనల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంల ద్వారా మహిళల్లో సాధికారతను పెంపొందించేందుకు గల అవకాశాలను ఇది సూచిస్తోందని కుమార్‌ వివరించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా విద్య, వొకేషనల్‌ ట్రైనింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీకి అప్రెంటిస్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి నేషనల్‌ స్కిల్స్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌) కూడా తోడైతే అప్రెంటిస్‌షిప్‌కు మరింత తోడ్పాటు లభించగలదని కుమార్‌ తెలిపారు.

 

Inidan Origin Data Scientist Fired At Canada: విదేశాల్లో యూట్యూబ్‌ వీడియోలు,చివరికి ఉద్యోగం ఊడిందిగా.. ఇంతకీ ఏం జరిగిందంటే..

#Tags