World Oldest Alphabet: ప్రపంచంలో తొలి వర్ణమాల ఇదే!
దాదాపు 4,400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాల పరిశోధకుల బృందం ప్రకటించింది. ఈ వర్ణమాలను సిరియాలోని టెల్ ఉమ్–ఎల్ మర్రా ప్రదేశంలో క్రీస్తుపూర్వం 2,400 సంవత్సరంలో జరిపిన తవ్వకాల్లో గుర్తించారు. ఈ వర్ణమాలున్న మట్టి వస్తువులు చేతి వేళ్ల ఆకృతిలో ఉంటాయి.
ఈ వర్ణమాలపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం, ఈ లిపి ఇప్పుడు చరిత్రలో కనుగొన్న వర్ణమాల కంటే 500 సంవత్సరాలు పురాతనమైనదిగా అంచనా వేయబడింది. ఈ పరిశోధన జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రొఫెసర్ గ్లెన్ స్వార్జ్ నేతృత్వంలో జరిగింది.
ఈ లిపి ప్రాచీన సమాజాల్లో కేవలం అగ్రవర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకూ రాయగలిగే సామర్థ్యం ఉన్నట్లు సూచిస్తుంది. వర్ణమాల ఉపయోగం సంబంధించి ఈ మట్టి వస్తువులపై రాతలు "లేబుల్"లుగా ఉపయోగించబడినట్లు భావిస్తున్నారు.
Best Cities: ప్రపంచంలో అత్యుత్తమ టాప్–10 నగరాలు ఇవే..
పూర్వం ఈజిప్ట్, పరిసర ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం 1900లో మొదటి వర్ణమాల ఉద్భవించిందని భావించబడింది, కానీ ఈ సిరియాలోని వర్ణమాల పరిశోధన ద్వారా ఒక కొత్త అవగాహన ఏర్పడింది.