WHO Notice : అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్న వైరస్‌.. డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌క‌ట‌న!

ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్‌’ వైరస్‌ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్క­డి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే వి­ధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ­ని విధిస్తున్నట్టు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

Mpox Virus: బీ అలర్ట్.. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న మంకీపాక్స్.. ఈ వ్యాధి లక్షణాలు ఇవే..

ఈ నేపథ్యంలో భారత్‌ సహా 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికను జారీచేసింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ మాట్లాడుతూ, ‘ఎమర్జెన్సీ కమిటీ సూచన మేరకు గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాం’అని అన్నారు. వ్యాధి సోకితే తీవ్రమైన కండరాల నొప్పి, జ్వరం వస్తాయి. 

#Tags