Mount Kilimanjaro: కిలిమంజారో పర్వతంపై వైఫై

అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో ఆఫ్రికన్‌ సంప్రదాయానికి ఈ పర్వతాన్ని ఒక ప్రతీకగా పరిగణిస్తుంటారు. సుమారు 19వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఒక ఘనతగా భావిస్తుంటారు పర్వతారోహకులు. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కిలిమంజారో ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం మాత్రమే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్‌ పర్వతం కూడా. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. పర్వతంలో మూడింట రెండో వంతు భాగానికి ఇంటర్నెట్‌ సౌకర్యం అందనుంది. వైఫై సౌకర్యం ఉన్న పర్వతం ఇదొక్కటే కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్‌ ఎవరెస్ట్‌పై 2010 నుంచే ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్నారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags