China-Taiwan Issue: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. నవంబర్ 16న జరిగిన ఈ భేటీ ఆత్మీయ పలకరింపులతో మొదలై హితబోధలు, తీవ్రమైన హెచ్చరికలతో సాగింది. చివరికి ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలన్న అంగీకారంతో సామరస్యపూర్వకంగా ముగిసింది. ‘తైవాన్ చైనాలో భాగం. తైవాన్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఎవరైనా రెచ్చగొడితే , గీత దాటి ప్రవర్తిస్తే మేము ఏం చెయ్యాలో అది చేస్తాం’ అని జిన్‌పింగ్ అన్నారు. చైనా ఏకపక్షంగా తైవాన్‌ను య«థాతథస్థితిని మార్చాలని చూసినా, శాంతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే గట్టిగా వ్యతిరేకిస్తామని బైడెన్ ప్రతి హెచ్చరికలు చేశారు.
ఇంటర్నేషనల్ ఫేమ్ అవార్డు అందుకున్న ప్రముఖ వైద్యురాలు?
పాజిటివ్ డెంటల్ సీఈవో, ప్రముఖ దంత వైద్యురాలు పేర్ల సృజన ఇంటర్నేషనల్ ఫేమ్ అవార్డు–2021 అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు సోనూసూద్ ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. స్మైల్ డిజైనింగ్‌లో సిద్ధహస్తురాలైన సృజన.. అనేక శాఖల ద్వారా వేలాదిమందికి సేవలందించారు.
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్–2021 ఎక్కడ జరగుతోంది?
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో నవంబర్ 17న కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం గెలిచింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రిషభ్ యాదవ్‌లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం దక్కించుకుంది.
చదవండి: లిబియా దేశ రాజధాని నగరం పేరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
ఎందుకు : తైవాన్ అంశంతోపాటు పలు అంశాలపై చర్చలు జరిపేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్