Presidential Elections: లిబియా దేశ రాజధాని నగరం పేరు?
లిబియా నియంత, దివంగత ముఅమ్మర్ అల్–గడాఫీ(కల్నల్ గడాఫి) కుమారుడు సయీఫ్ అల్ ఇస్లాం అదేశ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీఫ్ అల్ ఇస్లాం 2021, డిసెంబర్ 24న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసినట్లు లిబియా ఎన్నికల సంఘం నవంబర్ 14న ప్రకటించింది. దాదాపు 40 ఏళ్లపాటు లిబియాను పాలించిన గడాఫీ 2011లో తలెత్తిన తిరుగుబాటులో హతమైన విషయం తెలిసిందే. అనంతరం ఆ దేశం ప్రత్యర్థి వర్గాల హింసాత్మక చర్యలతో అట్టుడుకుతోంది. లిబియా రాజధాని ట్రిపోలీలో ఒక ప్రభుత్వం, తూర్పు ప్రాంతంలో మరో ప్రభుత్వం కొనసాగుతోంది.
లిబియా..
రాజధాని: ట్రిపోలీ; కరెన్సీ: లిబియన్ దినార్
ఈక్వెడార్ జైల్లో ఘర్షణ..
ఈక్వెడార్‌లోని గుయాక్విల్‌లో ఉన్న జైలులో రెండు ముఠాల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. నవంబర్ 13న జరిగిన ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు.
ఈక్వెడార్..
రాజధాని: క్విటో; కరెన్సీ: యునైటెడ్ స్టేట్స్ డాలర్
చదవండి: ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్‌ను ఎప్పుడు నిర్వహించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్