Italy shooting: ఇటలీ కేఫ్‌లో కాల్పులు.. ప్రధాని మెలోనీ స్నేహితురాలు మృతి

ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దేశ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు.

రోమ్‌లోని ఫిడెన్‌ జిల్లాలోని ఓ కేఫ్‌లో డిసెంబ‌ర్ 11న‌ ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబ‌ర్ 12న‌ జరగాల్సిన తమ అపార్ట్‌మెంట్‌ కమిటీ రెసిడెంట్స్‌ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు. ఇంతలోనే తుపాకీతో అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి  అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నికొలెట్టా గొలిసానో(50) తన స్నేహితురాలేనంటూ ప్రధాని జార్జియా మెలోనీ గతంలో ఆమెతో దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన మెలోనీ దేశ తొలి మహిళా ప్రధానిగా అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టారు. 

Suicide Bombers: సూసైడ్‌ బాంబర్లుగా శునకాలు!

#Tags