NATO: నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
North Atlantic Treaty Organization(NATO): నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ మే 16న ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమన్నారు. నాటోలో చేరికపై ఫిన్లాండ్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్ పార్లమెంట్ రిక్స్‌డగెన్‌లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్‌లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు.
GK National Quiz: 2021-22లో భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
Indian Navy: సూరత్, ఉదయగిరి యుద్ధనౌకల జలప్రవేశం ఎక్కడ జరిగింది?
టర్కీ అభ్యంతరం..
నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్ మే 17న 188–8 ఓట్లతో మద్దతు పలికింది.
13th Century: కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని ఎక్కడ గుర్తించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
ఎప్పుడు : మే 17
ఎవరు : స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్
ఎందుకు : నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్