Mpox Cases: ఈ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్‌ వైరస్‌!!

ప్రాణాంతక మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది.

కాంగోలో 450 మందిని పొట్టనబెట్టుకున్న ఈ వ్యాధి ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్‌ విస్తరణ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది. యూరప్‌ దేశమైన స్వీడన్‌లో ఒక ఎంపాక్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. 

ఎంపాక్స్‌లో క్లేడ్‌–2 కంటే క్లేడ్‌–1 ప్రమాదకరం. గత సంవ‌త్స‌రంలో క్లేడ్‌–2బీ వేరియంట్‌ పుట్టుకొచ్చింది. ఎంపాక్స్‌ సోకితే ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, చేతులపై కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. బాధితులతో లైంగిక సంబంధాలు, దగ్గరగా వెళ్లడం, శ్వాస పీల్చడం వల్ల వైరస్‌ సోకుతుంది. 

ప్రతి 100 కేసుల్లో కనీసం నలుగురు మరణించే ప్రమాదముంది. ఎంపాక్స్‌ నియంత్రణకు వ్యాక్సిన్ వచ్చినా అది పరిమితంగానే లభిస్తోంది. కాంగో, బురుండి, కెన్యా, రువాండాలకు వ్యాపించింది. ఎంపాక్స్‌ను ఇంకా మహమ్మారిగా ప్రకటించలేదు.

Air Pollution: నిత్యం 2 వేల మంది చిన్నారుల మృతి.. కార‌ణం ఇదే..!

ఎంపాక్స్ అంటే ఏమిటి.. ఎలా వ్యాపిస్తుంది?
ఎంపాక్స్ అనేది చిమ్పాంజీలు, గొరిల్లా వంటి జంతువుల నుంచి మనుషులకు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా శారీరక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఫ్లూ లక్షణాలతో పాటు శరీరంలో పుండ్లు, కురుపులు ఏర్పడటం ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలు. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, అది పరిమితంగానే లభిస్తోంది.

#Tags