Palestinian State: పాలస్తీనా స్వతంత్ర దేశం.. కీలక ప్రకటన చేసిన మూడు దేశాలు ఇవే..

పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి.

ఈ మూడు దేశాలు స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు మే 22వ తేదీ ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. ఈ దేశాల ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్‌ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం.  

శాంతి, సామరస్యం కోసమే..   
తూర్పు జెరూసలేం, వెస్ట్‌ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్‌ఈస్ట్‌ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్‌ బ్యాంక్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్‌ గహర్‌ పేర్కొన్నారు. 

Vladimir Putin in China: చైనాలో ప్ర‌ర్య‌టించిన రష్యా అధ్యక్షుడు పుతిన్..

ఐర్లాండ్‌కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్‌ ప్రధాని సైమన్‌ హ్యారిస్‌ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్‌సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ స్పష్టం చేశారు.  

#Tags