Russia-Ukraine war: నాటో కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభానికి ప్రధాన కారణంగా భావిస్తున్న నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో–NATO) సభ్యత్వంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. తమ దేశం ఇక ఎంతమాత్రం నాటో సభ్యత్వం కోసం ఆశించదని మార్చి 8న ప్రకటించారు. దీంతో ఒక సున్నితమైన అంశంపై స్పష్టత వచ్చినట్లయింది. జెలెన్‌స్కీ ప్రకటనపై రష్యా స్పందించాల్సిఉంది. నాటో సభ్యత్వం వద్దనుకోవడంతో పాటు వివాదాస్పద డొనెట్‌స్క్, లుహాన్స్‌క్‌ ప్రాంతాల సార్వభౌమత్వ అంశంపై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. 1949, ఏప్రిల్‌ 4న ఏర్పాటైన నాటో కూటమి ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఉంది. దీని ప్రధాన ఉద్దేశం: సభ్యదేశాల భద్రత కోసం ఉమ్మడి రక్షణ వ్యవస్థ ఏర్పాటు. ప్రస్తుతం ఈ కూటమిలో 30 సభ్య దేశాలు ఉన్నాయి.

సభ్య దేశాలు

చేరిన సంవత్సరం

యునైటెడ్ స్టేట్స్

1949

యునైటెడ్ కింగ్‌డమ్

1949

పోర్చుగల్

1949

నార్వే

1949

ఐస్లాండ్

1949

నెదర్లాండ్స్

1949

లక్సెంబర్గ్

1949

ఇటలీ

1949

ఫ్రాన్స్

1949

డెన్మార్క్

1949

కెనడా

1949

బెల్జియం

1949

టర్కీ

1952

గ్రీస్

1952

జర్మనీ

1982

స్పెయిన్

1955

పోలాండ్

1999

హంగేరి

1999

చెక్ రిపబ్లిక్

1999

స్లోవేకియా

2004

స్లోవేనియా

2004

రొమేనియా

2004

లిథువేనియా

2004

లాట్వియా

2004

ఎస్టోనియా

2004

బల్గేరియా

2004

క్రొయేషియా

2009

అల్బేనియా

2009

ఉత్తర మాసిడోనియా

2020

మోంటెనెగ్రో

2017

 

​​​​​​​GK Important Dates Quiz: ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే ఎప్పుడు?

రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
ఉక్రెయిన్‌ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా మరోమారు ప్రకటించింది. అయితే హ్యుమానిటేరియన్‌ కారిడార్ల పేరిట పౌరుల తరలింపునకు రష్యా పేర్కొన్న మార్గాల్లో అత్యధికం రష్యా, బెలారస్‌కు దారితీయడంపై ఉక్రెయిన్‌ అభ్యంతరాలు వెల్లడించింది.

పుతిన్, జెలెన్‌స్కీలకు మోదీ ఫోన్‌
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో భారత ప్రధానమంత్రి మోదీ మార్చి 7న ఫోన్‌లో విడివిడిగా సంభాషించారు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సహకరించాలని వారిని మోదీ కోరారు. పుతిన్, జెలెన్‌స్కీ నేరుగా చర్చలు జరపాలని, అప్పుడే శాంతియత్నాలు జోరందుకుంటాయని సూచించారు. ఉక్రెయిన్‌ నుంచి 20వేల మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తరలించడంలో సాయపడినందుకు జెలెన్‌స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Financial Action Task Force: ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌