Russia Attack Ukraine: పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్‌.. 100 క్షిపణులు, డ్రోన్లు..!

రష్యా ఉక్రెయిన్‌పై విస్తృతమైన క్షిపణులు, డ్రోన్ల దాడులు ఆగ‌స్టు 25వ తేదీ అర్ధరాత్రి నుంచి 26వ తేదీ ఉదయం వరకు నిర్వహించింది.

ఏకంగా 100 వందకు పైగా వివిధ రకాల క్షిపణులు, మరో 100 షహీద్‌ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ‘రష్యా మా కీలకమైన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపూరితంగా దాడులకు తెగబడింది. ఖార్కివ్, కీవ్‌ మొద లుకొని ఒడెసా, పశ్చిమ ప్రాంతాల వరకు జరిగిన దాడుల్లో భారీగా నష్టం వాటిల్లింది’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 

ఈ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 13 మంది పౌరులు గాయపడ్డారని చెప్పారు. తమ భూభాగంపై రష్యా పాల్పడిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్రూయి జ్‌ మిస్సైళ్లు, హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ కింజాల్‌ క్షిపణులు మొత్తం 15 రీజియన్లలో.. అంటే దాదాపు దేశంలోని సగం ప్రాంతాల్లో బీభత్సం సృష్టించినట్లు ఉక్రెయిన్‌ ప్రధాని డెనిస్‌ ష్మిహాల్‌ పేర్కొన్నారు. 

PM Modi Ukraine Visit: ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. యుద్ధాన్ని ఆపడానికి శాంతి, సుస్థిరతకు చర్చలే మార్గం

ఉక్రెయిన్‌ ప్రభుత్వ రంగ విద్యుత్‌ గ్రిడ్‌ ఆపరేటర్‌.. ఉక్రెనెర్గో.. దెబ్బతిన్న మౌలిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యవసర విద్యుత్‌ కోతలను ప్రకటించింది. ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థ డీటీఈకే కూడా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది. రాజధానిలోని విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కీవ్‌ మేయర్‌ తెలిపారు. 

కీవ్‌పైకి దూసు కొచ్చిన 15 క్షిపణులు, మరో 15 డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయన్నారు. కాగా, ఉక్రెయిన్‌ సైనిక–పారిశ్రామిక సముదాల నిర్వహణకు ఎంతో కీలకమైన విద్యుత్‌ వ్యవస్థలను తమ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు ఛిన్నాభిన్నం చేశాయని, లక్ష్యాలను అవి గురి తప్పకుండా ఛేదించాయని రష్యా ఆర్మీ ప్రకటించింది. సరటోవ్, యరోస్లావ్ల్‌ ప్రాంతాలపైకి ఉక్రెయిన్‌ ప్రయోగించిన 22 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ తెలిపింది. 

Water Bomb: భారత్‌పై చైనా వాటర్‌ బాంబ్‌.. అదే జరిగితే ఈ కష్టాలు తప్పవు!

#Tags