Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. పుతిన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పర్యటనపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఘాటుగా స్పందించారు.
‘‘ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణులు ఇస్తామని అమెరికా చెబుతోంది. మంచిదే. అలాగే కానివ్వండి. ఆ క్షిపణులను సైతం మేము కచ్చితంగా కూల్చేస్తాం’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని మరింత ప్రజ్వరిల్లజేయడానికే అమెరికా ఆయుధాలు ఇస్తోందని ఆరోపించారు. సంఘర్షణను ఇంకా పొడిగించాలన్నదే అమెరికా ఆలోచన అని దుయ్యబట్టారు. పుతిన్ మీడియాతో మాట్లాడుతూ త్వరగా, మెరుగ్గా యుద్ధాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని పునరుద్ఘాటించారు. గతంలో సైనిక చర్యలన్నీ సంప్రదింపులతోనే ముగిశాయని గుర్తుచేశారు.
Ukrainian President Zelenskyy: యుద్ధంలో లొంగిపోయే ప్రసక్తే లేదు.. జెలెన్‌స్కీ
#Tags