Russia-Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో... మార్షల్‌ లా విధించిన రష్యా

మాస్కో: ఉక్రెయిన్‌లో ఇటీవల ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల్లో రష్యా మార్షల్‌ లా అమల్లోకి తెచ్చింది. దీంతో ఆ ప్రాంతాల గవర్నర్‌లకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి.
Videos PREVIEW 3:07 Putin declares martial law in occupied territories

మార్షల్‌ లా నేపథ్యంలో ఈ నాలుగు ప్రాంతాల్లో కొత్తగా స్థానిక రక్షణబలగాల ఏర్పాటు, ప్రయాణ ఆంక్షలు, ప్రజాసమావేశాల రద్దు, కఠిన సెన్సార్‌ షిప్‌ విధానాలు, పాలనా యంత్రాంగానికి మరిన్ని అధికారాలు వంటి చర్యలు తీసుకునే అవకాశముంది. ‘ కీలకమైన సమస్యలకు పరిష్కారం కనుగొంటూ రష్యా రక్షణ, భవిష్యత్‌ భద్రత కోసం శ్రమిస్తున్నాం’ అంటూ రష్యా భద్రతా మండలి సమావేశం ప్రారంభం సందర్భంగా పుతిన్‌ చేసిన ప్రసంగాన్ని టెలివిజన్‌లో ప్రసారంచేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారతీయులు వీలైనంత త్వరగా దేశం వీడాలని అక్కడి భారత దౌత్య కార్యాలయం సూచించింది.

Also read: Ukraine war: అపార్టుమెంట్‌పై కూలిన రష్యా బాంబర్‌..

#Tags