PM Modi Poland Visit: భారత్‌–పోలండ్‌ మధ్య కుదిరిన సామాజిక భద్రతా ఒప్పందం

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ఆగస్టు 21వ తేదీ పోలెండ్‌ చేరుకున్నారు.

రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం పలికారు. భారత్‌, పోలెండ్‌ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలెండ్‌లో పర్యటిస్తున్నారు. పోలెండ్‌ పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. 

జామ్‌నగర్‌ పాలకుడు జామ్‌ సాహెబ్ దిగ్విజయ్‌సింగ్ జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా స్మారకార్థం వార్సాలో ఏర్పాటు చేసిన ‘గుడ్‌ మహారాజా స్క్వేర్‌’ వద్ద మోదీ నివాళులర్పించారు. 

భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. ఆగ‌స్టు 22వ తేదీ మోదీ పోలండ్‌ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తో సమావేశమవేశ‌మై ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సంఘర్షణలు, వివాదాలను శాంతియుతంగా దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవడమే ఉత్తమమైన విధానమని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేయగలిగే పూర్తిసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

Strategic Partnership: భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. ఎనిమిది ఒప్పందాలపై..
 
భారత్‌–పోలండ్‌ మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఒకదేశానికి చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులు మరో దేశంలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి వీలు కల్పించే సామాజిక భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనాలు, ఫార్మాస్యూటికల్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, కృత్రిమ మేధ(ఏఐ), అంతరిక్షం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి.  

#Tags