Pakistan Rupee: పాక్ రూపాయి మరింత పతనం
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ రూపాయి విలువ మరింత దిగజారింది. అమెరికా డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ.262.6కు పడిపోయింది.
జనవరి 27న బహిరంగ మార్కెట్‌లో ఒక దశలో డాలరుతో పోలిస్తే రూ.265కు, ఇంటర్ బ్యాంకింగ్‌లో రూ.266కు క్షీణించింది. చివరికి కోలుకుని రూ.262.6 వద్ద స్థిరపడింది. జనవరి 26వ తేదీతో పోలిస్తే 27వ తేదీ కరెన్సీ విలువ రూ.7.17 అంటే 2.73% మేర పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్(ఎస్‌బీపీ) తెలిపింది. ఇంటర్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో రూపాయి విలువ గురు, శుక్రవారాల్లో రూ.34 మేర దిగజారిందని, దేశం 1999లో నూతన ఎక్స్ఛేంజి రేట్ విధానాన్ని వచ్చాక ఇంత భారీగా పతనమవడం ఇదే మొదటిసారి. కాగా, అమెరికా డాలరుతో భారత్ రూపాయి మారకం విలువ రూ.81.61గా ఉంది.
Economic Crisis: ఎంపీల పర్యటనలు, లగ్జరీ కార్ల కొనుగోళ్లు బంద్..
#Tags