Al Jazeera offices: ఇజ్రాయెల్‌లో అల్‌–జజీరా కార్యాలయాల మూసివేత

తమ దేశంలో అల్‌–జజీరా మీడియా సంస్థకు చెందిన స్థానిక కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ అన్నారు.

అల్‌–జజీరా ఆఫీసులను ఎప్పటినుంచి మూసివేస్తారన్నది వెల్లడించారు. ఇది తాత్కాలిమా? శాశ్వతమా? అనేది బయటపెట్టలేదు.

ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ అల్‌–జజీరా గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ దాడులను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య శాంతి చర్చలకు ఖతార్‌ చొరవ చూపుతోంది. ఇరువర్గాలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్‌కు చెందిన మీడియా సంస్థ కార్యాలయాలను మూసివేస్తూ ఇజ్రాయెల్‌ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు.. ఎందుకంటే..

#Tags