World's Most Powerful Passports : అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా విడుద‌ల‌.. తొలి స్థానంలో సింగాపూర్‌!

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను హెన్లే–పార్ట్నర్‌ సంస్థ (లండన్‌) విడుదల చేసింది.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను హెన్లే–పార్ట్నర్‌ సంస్థ (లండన్‌) విడుదల చేసింది. హెన్లే పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ ప్రకారం–భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. భారతీయ పాస్‌పోర్ట్‌తో 58 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించొచ్చు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ డేటా ఆధారంగా ర్యాంక్‌లను రూపొందించారు.

Highest Temperature Record : అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రో­జుగా జూలై 22వ తేదీ!

ప్రస్తుతం సెనగల్, తజికిస్తాన్‌ దేశాల ర్యాంక్‌లతో ఇండియా ర్యాంక్‌ సమంగా ఉంది. అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్‌ మొదటి స్థానం సొంతం చేసుకుంది. సింగపూర్‌ పాస్‌పోర్ట్‌తో 195 దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. రెండో స్థానంలో జపాన్‌తోపాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పాస్‌పోర్ట్‌లు ఉన్నవారు 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వవచ్చు.

#Tags