Unhealthy Air: ప్రపంచంలోనే అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న‌దిదే..

ఖాట్మండు లోయలో వాయు కాలుష్యం స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

దీంతో నేపాల్ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ప్రజలను బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని కోరింది. 

ప్రపంచవ్యాప్తంగా 101 నగరాల్లో రియల్ టైమ్ కాలుష్యాన్ని కొలిచే సంస్థ ఐక్యూఎయిర్ ప్రకారం, ఖాట్మండు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.

ఇటీవ‌ల విడుద‌లైన అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల జాబితాలో  ప్రపంచంలోనే ఖాట్మండు అగ్రస్థానంలో ఉంది. న్యూ ఢిల్లీ, చియాంగ్ మాయి (థాయ్‌లాండ్), హనోయి (వియత్నాం), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), ఢాకా (బంగ్లాదేశ్) కూడా అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి.

 

World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణం.. దీని పేరు ఏమంటే..

#Tags