Tiger TRIUMPH 2024: భారత్‌–యూఎస్‌ ‘టైగర్‌ ట్రయంఫ్‌’ ప్రారంభం

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసం రెండు దేశాల మధ్య నిర్వహించే ‘టైగర్‌ ట్రయంఫ్‌’ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్‌ ట్రయంఫ్‌–2024, మార్చి 18న ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ వరకు రెండు ఫేజ్‌లలో జరుగనున్న ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. ఈ మేరకు యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్‌ సోమర్‌ సెట్‌ యుద్ధ నౌకతోపాటు ల్యాండింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్, ఎమ్మార్కెడ్‌ దళాలు విశాఖకు చేరుకున్నాయి.

ర్యాపిడ్‌ యాక్షన్‌ మెడికల్‌ టీమ్‌(ఆర్‌ఎంటీ) కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననుంది. ఈ నెల 25వ తేదీ వరకు హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో రెండు దేశాల త్రివిధ ద­ళాల శిక్షణ సందర్శనలు, క్రీడా పోటీలు, వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. ఆ తర్వాత 26 నుంచి 31వ తేదీ వరకు సీ ఫేజ్‌ విన్యాసాలు ఉంటాయి. ఇందులో హ్యుమానిటేరియన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌(హార్డ్‌),యుద్ధ విన్యాసాలను విశాఖ సము ద్ర తీరానికి 40 మైళ్ల దూరంలో నిర్వహించనున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags