India in Third Place : అటవీ విస్తీర్ణంలో మూడ‌వ స్థానంలో నిలిచిన భార‌త్‌..

భారత్‌లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) తన నివేదికలో పేర్కొంది. అటవీ శాతం పెరిగిన టాప్‌ 10 దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. జూలై 22న విడుదలైన నివేదికలో చైనా మొదటి స్థానంలో నిలిచింది.

UNESCO World Heritage Site : యునెస్కో వారసత్వ సంపదగా అహోమ్‌ సమాధులు..

చైనాలో 19,37,000 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగినట్లు ఎఫ్‌ఏవో నివేదిక పేర్కొంది. ఆ తర్వాత రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో 4,46,000 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం పెరిగింది. టాప్‌ టెన్‌ దేశాల్లో చిలీ, వియత్నాం, ట­ర్కీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా ఉన్నాయి. 

#Tags