India–Israel relations: భారతదేశ‌ రైతులకు ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధం ఏమిటి?

అరబ్ దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశం ఇజ్రాయెల్.. అయితే అది సాధించిన సాంకేతికత కారణంగా నేడు మొత్తం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకుంది.
India–Israel relations

రక్షణ రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో కూడా ఈ దేశం ఆదర్శంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్‌ వ్యవసాయ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఈ దేశం చుట్టూ సముద్రం, ఎడారి ఉన్నప్పటికీ ఇక్కడ  పుష్కలంగా పంటలు పండటం విశేషం. అయితే భారతదేశంలోని రైతులతో ఈ దేశానికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Is Israel-Hamas War Impact On Global Economy: ఇజ్రాయెల్, హమాస్‌ల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడనుందా?

మొదటి నుంచి టెక్నాలజీ విషయంలో ఇతరదేశాలతో భారత్‌ పోటీపడే స్థాయిలో లేదు. ఒకప్పుడు మన దేశంలో అన్ని కార్యకలాపాలు సంప్రదాయబద్ధంగా జరిగేవి. ముఖ్యంగా వ్యవసాయం విషయానికివస్తే దేశంలో సాగయ్యే వ్యవసాయంలో అధికశాతం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంటుంది. ఫలితంగా భారతదేశం ఈ రంగంలో భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. అయితే 1993లో ఇజ్రాయెల్, భారతదేశం వ్యవసాయ రంగంలో చేతులు కలిపినప్పటి నుంచి దేశంలోని రైతుల పరిస్థితి మరింతగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఇజ్రాయెల్ సహకారంతో 30కి పైగా వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

Operation Ajay: ఆపరేషన్ అజయ్‌ను మొద‌లుపెట్టిన భార‌త్‌

సాంకేతిక పరిజ్ఞానం అలవరచుకుని, అధునాతన వ్యవసాయం చేయాలనుకునే భారతీయ రైతులను శిక్షణకు ఇజ్రాయెల్ ఆహ్వానం పలుకుతుంటుంది. పలువురు భారతీయ రైతులు వ్యవసాయంలో శిక్షణకు ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ఇదే కారణం. శిక్షణ అనంతరం వారు తిరిగి భారత దేశానికి తిరిగివచ్చి తమ వ్యవసాయ ఉత్పత్తులను అనేక రెట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇజ్రాయెల్ సహాయంతో ప్రస్తుతం భారతదేశంలో అనేక వ్యవసాయ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

Israel-Palestine war: ఇజ్రాయెల్‌ పాలస్తీనాల‌ మధ్య భీకర యుద్ధం

గాలిలో సాగుచేసే వ్యవసాయానికి కూడా ఇజ్రాయెల్‌ పేరుగాంచింది. ఈ దేశంలో ఏరోపోనిక్స్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారు. ఈ సాంకేతికతలో వ్యవసాయానికి భూమి లేదా నేల అవసరం లేదు. ఈ పద్ధతిలో పండించిన కూరగాయలను మట్టిలో పండే కూరగాయలతో పోలిస్తే.. వాటికి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉండటం విశేషం. 

Global Hunger Index 2023: ప్రపంచ ఆకలి సూచీ–2023లో 111వ స్థానంలో భారత్‌

#Tags