Gender Equality: లింగ సమానత్వంలో భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు ఇవే..

ఐక్యరాజ్యసమితి లింగ సమానత్వంలో భారత్‌ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని కొనియాడింది.

కానీ, సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం వంటి అంశాలు ఇంకా లింగ సమానత్వానికి ఆటంకంగా ఉన్నాయి. ఈ అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో చర్యలు అవసరమని సూచించింది. 

ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్ డేనియల్ సీమౌర్, భారత్‌లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గూసన్ దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్‌లో 6.8 శాతం నిధులు పెరిగాయని తెలిపారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. 

Best Schools: ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల్లో మూడు భార‌త‌దేశానివే..

ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఈ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమని ఫెర్గూసన్ చెప్పారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరుగుతున్నదని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, లింగ ఆధారిత హింస (జీబీవీ) మాత్రం మహిళల భద్రత, స్వేచ్ఛకు పెద్ద ఆటంకంగా ఉందని అధికారులు తెలిపారు.

సామాజిక కట్టుబాట్లు చట్టాలను అమలు చేసేందుకు అడ్డంకిగా మారుతున్నాయని చెప్పారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తోందని తెలిపారు. 2022–23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతం పెరిగినా, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రత వంటి అంశాలను మెరుగుపరచడం అవసరం అని తెలిపారు.

BRICS Summit 2024: రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సు.. దీని ముఖ్యాంశాలు ఇవే..

#Tags