World Economy: ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్‌ కీలక ప్రకటన

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2024 అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అప్‌గ్రేడ్‌ చేసింది.

ఒడిదుడుకులను ఎదుర్కొంటూ.. అమెరికా వృద్ధి పయనం,ద్రవ్యోల్బణం నెమ్మదించ­డం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. తాజా అవుట్‌లుక్‌లో 2024 వృద్ధి రేటు­ను ఇంతక్రితం 2.9 శాతం అంచనాల నుంచి 3.1 శాతానికి పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌ను తగ్గించింది. 2023లో 6.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే.. 2024లో ఇది 5.8 శాతానికి, 2025లో 4.4 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. అగ్రదేశాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.6 శాతం ఉంటే.. 2024లో 2శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ వా­ణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3 శాతంగా ఉంటే.. 2025లో 3.6 శాతానికి పెరుగుతుందని తెలిపింది. చరిత్రాత్మాక వాణిజ్య వృద్ధి సగటు 4.9 శాతంగా ఉంది.

చదవండి: Snow Leopards: దేశంలో 718 మంచు చిరుతలు

#Tags