France : ఫ్రాన్స్‌లో హంగ్‌ పార్లమెంట్‌

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ మెజారిటీ దక్కలేదు. ఆ దేశ జాతీయ అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల ఫలితాలను జూలై 8న ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ 289 సీట్లకు అన్ని పార్టీల కూటములు దూరంగా నిలిచాయి. ఫ్రాన్స్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 577 సీట్లు ఉన్నాయి.

HIV Medicine Test : హెచ్ఐవీకి సూది మందుకు ప‌రీక్ష విజ‌య‌వంతం..

న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ లెఫ్టిస్ట్‌ కూటమి 180 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మోక్రాన్‌ సెంట్రిస్ట్‌ కూటమి 160 సీట్లు దక్కించుకొని.. రెండో స్థానంలో నిలిచింది. ఇక మెరైన్‌ లా పెన్‌కు చెందిన నేషనల్‌ ర్యాలీ కూటమికి 140 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కక పోవడంతో దేశంలో హంగ్‌ ఏర్పడింది.

#Tags