Global Gender Gap Report 2024: లింగ అంతర నివేదికలో అగ్రస్థానంలో ఉన్న ఐస్‌లాండ్.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..

ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) 2024 జూన్‌లో 18వ ఎడిషన్ గ్లోబల్ లింగ అంతర నివేదిక(Global Gender Gap Report)ను విడుదల చేసింది.

ఇందులో 146 దేశాలలో లింగ సమానత్వంపై సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఇది ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ రంగాలలో లింగ అంతరాలను పర్యవేక్షించడంపై దృష్టి పెడుతుంది. 

అగ్రగామీ దేశాలు ఇవే..
1.ఐస్‌లాండ్
2.ఫిన్‌లాండ్
3.నార్వే
4.న్యూజిలాండ్
5.స్వీడన్

వ‌రుసగా 15వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచిన ఐస్‌లాండ్ 93.5% లింగ సమానత్వాన్ని సాధించింది.  

భారత దేశ స్థానం ఇదే..
2023లో 127వ స్థానంలో ఉన్న భారతదేశ ర్యాంకింగ్ ఈ సంవ‌త్స‌రం 129వ స్థానానికి పడిపోయింది. 
దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ మొద‌టి నాలుగు స్థానాల్లో ఉండ‌గా, భారతదేశం 5వ స్థానంలో ఉంది. భారత్ ఆర్థిక రంగంలో లింగ సమానత చాలా తక్కువగా ఉంది. 

#Tags