Hyperloop Tube : మ‌ద్రాస్ ఐఐటీ విద్యార్థులు నిర్మించిన‌ ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌ లూప్‌ ట్యూబ్‌

హైపర్‌ లూప్‌ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్‌ ఐఐటీ 425 మీటర్ల పొడవైన హైపర్‌ లూప్‌ ట్యూబ్‌ను నిర్మించింది. అక్క‌డి విద్యార్థులు ‘ఆవిష్కార్‌ హైపర్‌లూప్‌’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి, దీని ట్రాక్‌ ఏ దశలో ఎలా ఉండాలి అనేది డిజైన్‌ చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు హైపర్‌లూప్‌ ఇంటర్నేషనల్‌ పోటీలు జరగనున్నాయని మద్రాస్‌ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి.

Tarang Shakti 2024 : భారత్ తొలిసారిగా నిర్వ‌హిస్తున్న బహుళ దేశాల వైమానిక విన్యాసం

‘‘హైపర్‌లూప్‌ ట్యూబ్‌లో ‘లూప్‌’ అనే కీలక భాగం ఉంటుంది.. అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్‌ లాంటి నిర్మాణం. దీంతోపాటు, పాడ్‌ అనే మరో భాగం కూడా ఉంటుంది. అది రైలు బోగీ లాంటి వాహనం. మ‌రొక‌టి,  టెర్మినల్‌.. అంటే హైపర్‌లూప్‌ బోగీలు ఆగే ప్రదేశం.

#Tags