Indians Arrested in America: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులు పట్టివేత
2022 అక్టోబర్–2023 సెప్టెంబర్ కాలంలో అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 96,917 మంది భారతీయులు పట్టుబడినట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూసీబీపీ) తెలిపింది.
ఇటీవల అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య అయిదు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2019–20లో 19,883 మంది పట్టుబడగా ఈ సంఖ్య 2020–21లో 30,662కు చేరిందని, 2021–22లో 63, 927కు పెరిగిందని వివరించింది. 2022 అక్టోబర్–2023 సెప్టెంబర్ మధ్యన దొరికిపోయిన వారిలో కెనడా సరిహద్దుల్లో 30,010 మంది, మెక్సికో సరిహద్దుల్లో మరో 41,770 మంది ఉన్నారని తెలిపింది. యువత అత్యధికంగా 84 వేల మంది వరకు ఉన్నట్లు పేర్కొంది. ఒంటరిగా వచ్చి మరో 730 మంది మైనర్లు కూడా ఉన్నట్లు వివరించింది.
United Nations Voting: ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ ఎలా జరుగుతుంది?
#Tags