Smart Phones : స్మార్ట్‌ ఫోన్లతో భారత్‌లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి: ఐరాస

భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్‌ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (యూఎన్‌జీఏ ) అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ ప్రశంసించారు.

దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్‌ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు. తా­జాగా ఆహారం, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవ­లం స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగించడం ద్వారా గత 6 ఏళ్లలో 80కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు.

World’s Tallest Building: 3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్‌ భవనం!

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్నిరకాల లావాదేవీలను స్మార్ట్‌ ఫోన్ల­తో పూర్తి చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్నెట్‌ వ్యాప్తి తోడ్పడుతుందని తెలిపారు. ఇతర దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలని డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ సూచించారు. 

Electric Airliner: త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న‌ విద్యుత్‌ విమానం..

#Tags