Moscow Concert Attack: రష్యా మాస్కోలో భయంకర ఉగ్రవాద దాడి.. 60 మంది మృతి

రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు.

మార్చి 22వ తేదీ మాస్కోలోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్ లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 60 మందికి పైగా మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ 'ఫిక్నిక్' సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో, సైనిక దుస్తుల్లో ఉన్న ఐదుగురు దుండగులు హాల్ లోకి చొచ్చుకుని బాంబులు విసురుతూ, తుపాకులతో కాల్పులు జరిపారు.

భయాందోళనల మధ్య సహాయ చర్యలు..

  • తుపాకుల మోత నడుమ, భయాందోళనలతో ప్రేక్షకులు సీట్ల మధ్య దాక్కున్నారు.
  • సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
  • హాల్ లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
  • గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి.

దాడికి కారణం..

  • ఈ దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియదు.
  • ISIS ఈ దాడి తమ పనే అని ప్రకటించుకుంది.
  • రష్యా నేషనల్ గార్డు ఉగ్రవాదుల కోసం గాలింపు చేస్తోంది.

E-Cigarettes: డిస్పోజబుల్ ఇ-సిగరెట్‌, వేప్‌లు నిషేధం!

అధ్యక్షుడి స్పందన..

  • దాడి సమాచారం అందుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన.
  • దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

 

#Tags