World Day Against Trafficking in Persons: జూలై 30వ తేదీ వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం

వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు ప్ర‌తి సంవ‌త్స‌రం జూలై 30వ తేదీ ప్రపంచ దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.

అక్ర‌మ ర‌వాణా నుంచి బ‌య‌ట‌ప‌డిన బాధితుల దృష్టి కోణాన్ని తెలిపేందుకు వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ గ్రూప్ (ICAT), కౌన్సిల్ ఆఫ్ యూరోప్ గ్రూప్ ఆఫ్ హ్యూమన్ బీంగ్స్ జూలై 30వ తేదీ వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

కౌన్సిల్ ఆఫ్ యూరోప్ కన్వెన్షన్ ఆన్ ట్రాఫికింగ్ అఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీంగ్స్, ఎల్లప్పుడూ బాధితుల రక్షణ, వారి హక్కులను కాపాడుతూ ట్రాఫికింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

అక్రమ రవాణా బాధితులకు సకాలంలో సమర్థవంతమైన సహాయం అందించడం అత్యవసరం అని మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చర్యలపై నిపుణుల బృందం(GRETA) నొక్కిచెబుతుంది. అక్రమ రవాణాదారుల చ‌ర్య‌ల‌ను అడ్డుకోడాన్ని ఇది పోత్సహిస్తుంది. అంతేకాకుండా బాధితులు నేర విచార‌ణ‌లో పాల్గొని ప‌రిహారం పొంద‌డానికి అవ‌కాశం ఉండాలని, అలాగే ప్రాణాల‌తో ఉన్న‌వారి అవ‌స‌రాల‌ను తీర్చాల‌ని GRETA చెడుతుంది.

ఈ సంవత్సరం థీమ్.. "మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటంలో పిల్లలను వదిలివేయవద్దు". ఇది సమాజంలోని అత్యంత హాని కలిగించే సమూహాలలో ఒకటైన పిల్లలను రక్షించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతోంది.

International Friendship Day: జూలై 30వ తేదీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

#Tags