Telangana Language Day: సెప్టెంబర్ 9వ తేదీ తెలంగాణ భాషా దినోత్సవం

తెలుగు భాష అస్తిత్వం కోసం తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు తన రచనల ద్వారా ఎంతో శ్రమించారు.

కాళోజీ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. అయినా తెలుగు భాష ఔన్యత్యాన్ని గుర్తించి ఈ భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 9వ తేదీ కాళోజీ నారాయణ రావు జయంతికి గుర్తింపునిస్తూ తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 

ఈ సందర్భంగా నేడు(సెప్టెంబర్ 9వ తేదీ) రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగు భాషాభివృద్ధికి దోహదపడినవారిలో గిడుగు రామ్మూర్తి కంటే కాళోజీ నారాయణ రావు ముందటివారు. కానీ తెలుగు భాషాభివృద్ధికి కాళోజీ చేసిన సేవలు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాతే వెలుగులోకి వచ్చాయి. 

తెలంగాణ యాస అంటే తెలుగు భాష అని గట్టిగా వాదిస్తూ తెలుగు భాషా వ్యాప్తికి తన రచనలతో విమర్శకులను మెప్పించిన కవి, రచయిత కాళోజీ. తెలంగాణ యాసలో తెలుగు భాషలో 30 నుంచి 40 రచనలను చేశారు కాళోజీ. ఆయన రచించిన గ్రంథాల్లో ప్రసిద్ద రచన ‘నా గొడవ’ అనే పుస్తకానికి ప్రసిద్ధ జ్ఞాణపీఠ అవార్డు దక్కాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల దక్కలేదు.

September Important Days: సెప్టెంబర్ నెల‌లోని ముఖ్యమైన రోజులు ఇవే..

తెలుగు నుంచే తెలంగాణ పదం
తెలుగు పదం నుంచే తెలంగాణ పదం జీవం పోసుకుందని చెప్పడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన శైవాలయాల్లో కాళేశ్వరం, ముక్తేశ్వరం, వేములవాడలు ప్రధానం. ఈ మూడు చోట్ల లింగేశ్వరుడు వివిధ రూపాలలో కొలువై ఉండటంతో త్రిలింగం అనే పేరు వచ్చింది. తెలుగు పదం ఉద్భవించిన తర్వాత మన ప్రాంతంలో మాట్లాడే భాషను తెలుగు భాషగా గుర్తించారు. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని తెలంగాణ అని వాడుకలోకి తీసుకవచ్చినట్లు చరిత్రకారులు స్పష్టం చేశారు.

Telugu Language Day: ఆగ‌స్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం

#Tags