Mega Industrial Hub: పారిశ్రామిక వాడలో ఇప్పటికే 23 కంపెనీల ఏర్పాటుకు దరఖాస్తు

క‌ర్నూలు జిల్లాలో ఓర్వకల్‌ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ కోసం 11 గ్రామాల పరిధిలో 10,900 ఎకరాల భూమిని ఏపీఐఐసీ సేకరించింది.

ఇందులో 413.19 ఎకరాల్లో రూ.2,938 కోట్లతో జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటైంది. త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రత్యక్షంగా 1060 ఉద్యోగాలు, పరోక్షంగా మరో 3 వేల ఉద్యోగాలు రానున్నాయి. దీంతో పాటు గుట్టపాడు క్లస్టర్‌లో మరో 4,900 ఎకరాలు సేకరించింది. 

ఇందులో సిగాచీ ఇండస్ట్రీస్‌, ఆర్‌పీఎస్‌ ఇండస్ట్రీస్‌తో పాటు మారుతి–సుజుకి లాంటి పెద్ద కంపెనీలు ఫార్మా ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేసేందుకు భూముల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే ప్రైమోపాలీప్యాక్‌(ప్లాస్టిక్‌ ఇండస్ట్రీ), బ్లాక్‌హ్యాక్‌, ఎక్సైల్‌ ఇమ్యూన్‌ లాజిక్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌(వెటర్నరీ ఫార్మా) భారీ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌తో పాటు మరో 18 బడా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..
#Tags