Insurance Industry: శాపియన్స్ ఇంటర్నేషనల్‌తో చేతులు కలిపిన సంస్థ?
బీమా రంగ సొల్యూషన్స్ అందించేందుకు ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ, విదేశీ సంస్థ శాపియన్స్ ఇంటర్నేషనల్ చేతులు కలిపాయి. ప్రాథమికంగా ఇన్సూరెన్స్ వ్యవస్థల(సిస్టమ్స్) అభివృద్ధికి డిజైన్‌ను అందించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. భాగస్వామ్యం ద్వారా తొలుత ఉత్తర అమెరికాపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశాయి. తదుపరి యూరప్, ఆసియాలలో విస్తరించే ప్రణాళికలున్నట్లు వెల్లడించాయి.
GK Science & Technology Quiz: "నూర్-2" అనే సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
సైయంట్ చేతికి సైటెక్
గ్లోబల్ ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైటెక్‌ను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల హైదరాబాద్ కంపెనీ సైయంట్ తాజాగా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా సుమారు రూ. 800 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా బిజినెస్ ఆఫరింగ్స్‌ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. 1984లో ఏర్పాటైన సైటెక్ అంతర్జాతీయ ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసులను అందిస్తోంది.
ఇన్వెస్టర్లలో చైతన్యానికి యాంఫీ టీవీ కార్యక్రమాలు
ఇన్వెస్టర్లకు మార్కెట్లలో అస్థిరతలు, పెట్టుబడులపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి).. మూడు టెలివిజన్ వాణిజ్య చిత్రాలను రూపొందించింది. సచిన్ టెండుల్కర్, మిథాలీరాజ్ ఇందులో నటించారు. మోసపూరిత పథకాలు, నూతనతరం ధోరణలపై పెట్టుబడులతో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో అవగాహన కల్పించడం.. మ్యూచువల్ ఫండ్స్ మాదిరి నియంత్రణ మార్గాల్లోకి పెట్టుబడులు మళ్లించుకునేలా వారిని ప్రోత్సహించే సమాచారంతో వీటిని రూపొందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశీ సంస్థ శాపియన్స్ ఇంటర్నేషనల్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ
ఎందుకు : బీమా రంగ సొల్యూషన్స్ అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్