Skip to main content

Social Network Company: ట్విటర్‌ను కొనుగొలు చేసిన కుబేరుడు ఎవరు?

Twitter - Elon Musk

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. ఈ మేరకు తాజాగా ఒప్పందం కుదిరింది. టేకోవర్‌ విలువ దాదాపు 44 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడైన మస్క్‌ సంపద విలువ ప్రస్తుతం 279 బిలియన్‌ డాలర్ల పైమాటే. టెస్లాలో అయనకు 17 శాతం వాటాలు ఉన్నాయి. ఇటీవలే  ట్విటర్‌లో 9.2 శాతం వాటాలను 2.9 బిలియన్‌ డాలర్లకు మస్క్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.

GK International Quiz: ఇన్‌స్టాగ్రామ్ ఇకపై ఏ దేశంలో అందుబాటులో ఉండదు?

ట్విటర్‌ కథ ఇదీ.. 

  • అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సర్వీస్‌ ట్విటర్‌ను జాక్‌ డోర్సీ, బిజ్‌ స్టోన్, ఎవాన్‌ విలియమ్స్, నోవా గ్లాస్‌ కలిసి 2006లో ఏర్పాటు చేశారు.
  • కొన్ని పదాల్లో క్లుప్తంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడేలా దీన్ని ఉద్దేశించారు. 
  • ప్రస్తుతం దీనికి ప్రవాస భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
  • ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే ట్విటర్‌ యూజర్ల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ సెలబ్రిటీలు, ప్రపంచ నేతలు, జర్నలిస్టులు, మేధావులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  • స్వయంగా మస్క్‌కు 8.1 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
  • గతేడాది రెండో త్రైమాసికం గణాంకాల ప్రకారం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 7.7 కోట్ల పైచిలుకు ఉండగా.. భారత్‌లో వీరి సంఖ్య 2.36 కోట్ల స్థాయిలో ఉంది.​​​​​​​

Cement Supply: దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరా ప్రారంభించిన సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 25
ఎవరు    : ఎలాన్‌ మస్క్‌
ఎందుకు : ట్విటర్‌ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Apr 2022 04:35PM

Photo Stories