EV Charging Stations: ఈవీ చార్జింగ్‌ ఇన్‌ఫ్రా ఏర్పాటుకు ఏ సంస్థతో జియో జట్టు కట్టింది?

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్‌ వాహన సేవల సంస్థ బ్లూస్మార్ట్‌తో జియో–బీపీ జట్టు కట్టింది.

ఈ ఒప్పందం ప్రకారం బ్లూస్మార్ట్‌ కార్యకలాపాలు ఉన్న నగరాల్లో ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రణాళికలు, అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ కలిసి సంయుక్తంగా జియో–బీపీని జాయింట్‌ వెంచర్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దేశ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్‌) వీటిని ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ సెప్టెంబర్‌ 9న తెలిపింది.

ఓయోతో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రావెల్, ఆతిథ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు, టెక్నాలజీలను కలిసి అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : విద్యుత్‌ వాహన సేవల సంస్థ బ్లూస్మార్ట్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 9
ఎవరు    : జియో–బీపీ 
ఎందుకు  : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం...
 

 

#Tags