Risk Manager of the Year Award 2024: ఆర్బీఐకి అంతర్జాతీయ అవార్డ్‌

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)కు అంతర్జాతీయ అవార్డ్‌ లభించింది. లండన్‌కు చెందిన పబ్లిషింగ్ హౌస్ ‘సెంట్రల్ బ్యాంకింగ్’ నుంచి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

రిస్క్ కల్చర్, అవగాహనను మెరుగుపరిచినందుకు బెస్ట్ రిస్క్ మేనేజర్ అవార్డు లభించిందని ఆర్బీఐ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా తెలియజేసింది. ఆర్బీఐ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ అవార్డును అందుకున్నారు.

చదవండి: Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథం

గత కొంత కాలంగా ఆర్బీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కస్టమర్లకు సేవల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్యాంకుల్ని విడిచిపెట్టట్లేదు. చర్యలు తీసుకుంటూనే ఉంది. అదే సమయంలో రిస్క్‌ల గురించి ఖాతాదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తోంది.

#Tags