GST Collections: జీఎస్‌టీ వసూళ్లు.. 1.82 ల‌క్ష‌ల కోట్లు!

భారత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూలైలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.3 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

2017 జూలై 1వ తేదీన కొత్త పరోక్ష పన్ను వసూళ్ల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి మూడో అత్యధిక వసూళ్లు.

ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలైలో మొత్తం రీఫండ్‌లు రూ.16,283 కోట్లుగా ఉన్నాయి. రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర వస్తు, సేవల పన్ను (జీఏస్టీ) సేకరణ రూ.1.66 లక్షల కోట్లుగా ఉంది.
స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,82,075 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.32,386 కోట్లు, స్టేట్‌ జీఎస్టీ రూ.40,289 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.96,447 కోట్లు, సెస్ రూ.12,953 కోట్లు ఉన్నాయి.  

దేశీయ కార్యకలాపాల పన్నుల ద్వారా ఆదాయం 8.9 శాతం వృద్ధి చెంది జులైలో రూ.1.34 లక్షల కోట్లుకు చేరింది. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 14.2 శాతం పెరిగి రూ.48,039 కోట్లకు చేరింది.

స్థూల జీఎస్టీ రాబడులు ఏప్రిల్ 2024లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్ 2023లో ఇది రూ.1.87 లక్షల కోట్లు. తాజాగా వసూలైన జీఎస్టీ రూ.1.82 లక్షల కోట్లు మూడో భారీగా వసూళ్లుగా నమోదయ్యాయి.

Employment: ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు.. ఎక్కువ ఉన్న‌ది ఈ రాష్ట్రంలోనే..!

#Tags