Road Transport and Highways: నల్లగొండ బైపాస్‌ నిర్మాణానికి రూ.516 కోట్లు.. ఏపీలో కూడా..

నల్లగొండ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభ‌వార్త‌ చెప్పింది.

తెలంగాణలోని నకిరేకల్‌ నుంచి నాగార్జునసాగర్‌ సెక్షన్‌ వరకు ఉన్న జాతీయ రహదారి 565లో 14 కిలో మీట‌ర్ల‌ పొడవైన నాలుగు లేన్ల నల్లగొండ పట్టణ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.516 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అక్టోబ‌ర్ 14వ తేదీ ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్‌ తగ్గడమే కాకుండా నకిరేకల్‌ – నాగార్జునసాగర్‌ మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని, రహదారి భద్రత కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు.

 

 

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో.. 200.06 కిలో మీట‌ర్ల‌ మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సీఆర్‌ఐఎఫ్‌ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సీఆర్‌ఐఎఫ్‌ సేతు బంధన్‌ పథకంలో భాగంగా, గుంటూరు జిల్లాలోని గుంటూరు–నల్లపాడు రైల్వే సెక్షన్‌లో నాలుగు లేన్ల శంకర్‌ విలాస్‌ రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి గాను రూ.98 కోట్ల విడుదలకు కూడా ఆమోదం తెలిపినట్లు గడ్కరీ వివరించారు.

Central Government: 28 రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రూ.కోట్లు అంటే..!

#Tags