World Day Against Child Labour: జూన్ 12వ తేదీ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 12వ తేదీ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జ‌రుపుకుంటున్నారు.

బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్త‌ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ప్రారంభించింది.

ఈ సంవత్సరం థీమ్ ఇదే..
ఈ ఏడాది థీమ్ ‘మన కట్టుబాట్లపై పని చేద్దాం: బాల కార్మికులను అంతం చేయండి (Let’s Act on Our Commitments: End Child Labour)’

ఈ రోజు ల‌క్ష్యాలు ఇవే..
➤ అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం.
➤ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం.

World Environment Day: జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. 

#Tags