Rabindranath Tagore Birthday: మే 7వ తేదీ రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టిన‌రోజు.. ఈయ‌న జీవిత చరిత్ర ఇదే..

రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 సంవ‌త్స‌రం, మే 7వ తేదీ కోల్‌కతాలో జన్మించారు.

ఈ సంవ‌త్స‌రం(2024) ఈయ‌న‌ది 163వ జయంతి. దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవీలకు ఈయ‌న‌ పద్నాలుగో సంతానం. చిన్నతనంలోనే కుతూహలం, సృజనాత్మకతతో ప్రకాశించారు. బాల్యంలోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావడంతో బయటి ప్రపంచంపై మోజు పెరిగింది. 8 ఏళ్ల వయస్సులోనే ఒక ఫ్రెంచి కవితకు అనువాదం చేశారు.

ఈయ‌న విద్య ఇదే.. 
➤ పాఠశాలకు బదులుగా ఇంట్లోనే విద్యను అభ్యసించారు.
➤ ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలు, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు నేర్చుకున్నారు.
➤ ఆదివారాలలో సంగీతం, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నారు.
➤ బెంగాలీ, ఆంగ్ల భాషల్లో పట్టు సాధించారు.
➤ ఉన్నత విద్య కోసం ఇంగ్లాండు వెళ్లి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాల ద్వారా ఆంగ్ల సాహిత్యంపై మరింత అభిరుచి పెంచుకున్నారు.

World Asthma Day 2024: ప్రపంచ ఆస్తమా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ఈయ‌న ర‌చించిన రచనలు..
గీతాంజలి: బెంగాలీ భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచ ఖ్యాతి
➤ 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి, "విశ్వకవి" బిరుదు
➤ భగ్న హృదయం, విర్గరేర్ స్వప్న బంగ, సంగీత ప్రభాత
➤ వాల్మీకి ప్రతిభ, చిత్రాంగద, ప్రకృతి-ప్రతీక, కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ
గోరా: మత సామరస్యాన్ని చాటిన నవల
➤ "జనగణమన" భారత జాతీయ గీతంగా రచించారు.
➤ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ద్వారా ఆమోదం పొందారు.

సామాజిక సేవలు.. 
➤ శాంతినికేతన్‌గా ప్రసిద్ధి చెందిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
➤ గ్రామాభ్యుదయం కోసం శ్రీనికేతాన్ని నెలకొల్పి, పునర్నిర్మాణానికి కృషి
➤ జాతీయోద్యమంలో పాల్గొని, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడారు.

World Press Freedom Day 2024: మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.. 

రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మహాకవి, నాటక రచయిత, సంగీతకారుడు, చిత్రకారుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త. భారతీయ సంస్కృతి, సాహిత్యానికి అమూల్యమైన సేవ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు.

#Tags