Happy Independence Day 2024: ఫ్లాగ్ కోడ్‌లో..ఇవి తప్పనిసరి..
అంతేకాకుండా దేశభక్తిని, భారత ప్రతిష్టను ప్రదర్శించే వివిధ సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని వినియోగిస్తాం. ఇటీవలి కాలంలో హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే జాతీయ జెండా ఎగరవేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఈ నియమావళికి ఏ మాత్రం అవాంతరం ఎదురైనా దేశ ప్రతిష్టకే అవమానం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం సూచించిన ఫ్లాగ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి.
Also read:
Miss Universe 2024: వైకల్యం విజయానికి అడ్డంకి కాదు.. అందాల పోటీలో కిరీటం ధరించి చరిత్ర సృష్టించిన తొలి బధిర మహిళ
ఇవి తప్పనిసరి..
ఇతర దేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసే సమయంలో వరుసలో మొదటి స్థానంలో కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లి‹Ùలో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలి. వృత్తాకారంలో ఎగరేసినప్పుడు భారత పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. మన పతాకాన్ని ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి. పతాకాన్ని సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. వక్తలు ఉపన్యసించేచోట ఉన్నట్లైతే వారికి కుడిచేతి వైపునే ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకెళ్ళే సమయంలో మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్లేటప్పుడు కుడివైపున మొదటిదిగా లేదా మధ్యలో అన్నిటికంటే ముందు ఉండాలి. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా జాతీయ జెండాను కిందికి దించరాదు.
Also read: