Daily Current Affairs in Telugu: 5 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. ఆప్కాబ్ (ద ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్) ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలో సీఎం జగన్ ఆప్కాబ్ నూతన లోగో, ఆప్కాబ్ బ్రాండ్ ఐడెంటిటీ గైడ్‌లైన్స్ (బీఐజీ) బిగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.
2. కోర్టు హాల్‌లోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన బొంబాయి హైకోర్టు నాగ్‌పుర్ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో.
3. దేశవ్యాప్తంగా రూ.24,470 కోట్లతో ఎంపిక చేసిన 506 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఈ నెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.
☛☛ Daily Current Affairs in Telugu: 4 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. భారతీయ- అమెరికన్ ఆరోన్ 'రోనీ' ఛటర్జీ తాజాగా అమెరికా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్‌ఈసీ)లో వైట్ హౌస్ కోఆర్డినేటర్ పదవి నుండి వైదొలగారు.
5. అమెరికాలోని సాల్ట్‌లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ ఇన్‌చార్జిగా సోహిని సిన్హాను నియమించిన FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే.
6. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యర్రాజి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 200 మీటర్ల విభాగంలో అమ్లాన్ బొర్గోహైన్ కాంస్య పతకం సాధించాడు.
7. జర్మనీలో జరిగిన ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు దేశానికి తొలి స్వర్ణ పతకం సాధించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 3 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్