India-Russia Annual Summit: ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు.. పాల్గొననున్న ప్రధాని మోదీ

22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

ఈ సంద‌ర్భంగా మోదీ జూలై 8వ తేదీ నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 

మూడేళ్ల విరామం తర్వాత భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చివరిసారిగా 2021 డిసెంబర్‌లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. జూలై 8వ తేదీ మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్‌ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్‌లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. 

ఈ సంద‌ర్భంగా రాష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. 

Shanghai Cooperation Organisation: ఎస్‌సీఓ వార్షిక శిఖరాగ్ర సమావేశం.. చైనా విదేశాంగ మంత్రిని క‌లిసిన‌ జైశంకర్‌

ఆస్ట్రియాలోనూ పర్యటన.. 
రష్యా పర్యటన తర్వాత 9వ తేదీ మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌ డీర్‌ బెల్లాన్, చాన్స్‌లర్‌ కార్ల్‌ నెహామెర్‌లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్‌ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌కు మోదీ స్పందించారు. 

‘ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’ అని మోదీ  పోస్ట్‌లో పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు.

Chabahar Port: భారత్‌, ఇరాన్ మ‌ధ్య‌ చబహార్ పోర్ట్ ఒప్పందం

#Tags