World Records: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం

శ్రీశైలం దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది.

శ్రీశైలం దేవస్థానానికి లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఉల్లాజి ఇలియా­జర్‌ తెలిపారు. సెప్టెంబ‌ర్ 13వ తేదీ దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రత్యేక సమావే­శాన్ని నిర్వహించారు.  ఈ సమావేశంలో డాక్టర్‌ ఉల్లాజి ఇలియాజర్‌ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని దేవస్థానం ఈవోకి అందజేశారు.

శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధాన ఆలయాల ఎత్తు, వెడల్పు, ప్రధానాలయం చుట్టూగల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు, నందీశ్వరుడు సైజు, ఆలయ నిర్మాణం మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ జాబితాలో చేర్చినట్లు ఉల్లాజి ఇలియాజర్‌ చెప్పారు. దక్షిణ భారత్‌లో ఈ తరహా క్షేత్రాలు ఉంటే 9000798123 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

National Energy Leader Award: విశాఖ స్టీల్ ప్లాంటు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు

#Tags