Gurajada Apparao: ఇంగ్లిష్‌ పద్య కావ్యం సారంగధరను ఎవరు రచించారు?

మహాకవి గురజాడ వేంకట అప్పారావు 159వ జయంతి కార్యక్రమాలు సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరంలో సెప్టెంబర్‌ 21న ఘనంగా జరిగాయి. గురజాడ జయంతి(సెప్టెంబర్‌ 21న) సందర్భంగా.. గురజాడ సాంస్కృతిక సమాఖ్య, నవసాహితీ ఇంటర్నేషనల్‌ (చెన్నై) సంస్థలు సంయుక్తంగా ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రదానం చేశాయి. సాహిత్యం రంగంలో విశేష కృషి చేసిన బెంగళూరుకు చెందిన పువ్వాడ వెంకటేష్‌ ఈ అవార్డును అందుకున్నారు.

గురజాడ...

ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు 1862 సెప్టెంబరు 21న విశాఖపట్నం జిల్లా, ఎలమంచిలి మండలం, యస్‌. రాయవరం గ్రామంలో జన్మించారు. 1915, నవంబర్‌ 30న మరణించిన గురజాడ... తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరిగా నిలిచారు.

 

గురజాడ రచనల్లో కొన్ని...

  • దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా(దేశ భక్తి గేయం)
  • కన్యాశుల్కము(నాటకం)
  • సారంగధర (ఇంగ్లిష్‌ పద్య కావ్యం)
  • పూర్ణమ్మ
  • కొండుభట్టీయం
  • నీలగిరి పాటలు
  • ముత్యాల సరాలు
  • కన్యక
  • సత్యవ్రతి శతకము
  • బిల్హణీయం (అసంపూర్ణం)
  • సుభద్ర
  • లంగరెత్తుము
  • దించులంగరు
  • లవణరాజు కల
  • కాసులు
  • సౌదామిని (రాయాలనుకున్న నవలకు తొలిరూపం)
  • కథానికలు
  • మీపేరేమిటి 
  • దిద్దుబాటు
  • మెటిల్డా
  • సంస్కర్త హృదయం
  • మతము విమతము
  • పుష్పాలవికలు

చ‌ద‌వండి: సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన రచయిత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  బెంగళూరుకు చెందిన పువ్వాడ వెంకటేష్‌కు ఉత్తమ కవితా పురస్కారం ప్రదానం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : గురజాడ సాంస్కృతిక సమాఖ్య, నవసాహితీ ఇంటర్నేషనల్‌ (చెన్నై) సంస్థలు
ఎక్కడ : విజయనగరం, విజయనగరం జిల్లా
ఎందుకు : సాహిత్యం రంగంలో విశేష కృషి చేసినందుకు...
 

 

#Tags