Chief Justice of India N.V. Ramana: జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ఆగస్టు 5వ తేదీన (శుక్రవారం) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానం చేయనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు.
రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. ఇది ఓయూ 48వ గౌరవ డాక్టరేట్ అని, 21 ఏళ్ల అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దానిని ప్రదానం చేస్తున్నామని వివరించారు.
#Tags